ఉల్లిపాయల కోసం ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. కర్నూలులో వేకువ జామున 4 గంటల నుంచే క్యూలైన్లలో జనం పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి లైన్లలో వేచి ఉంటూ వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కరికీ కనీసం 2 కిలోలు ఇవ్వాలని కోరుతున్నారు.
'కేజీ ఏం సరిపోతుంది.. రెండు కేజీలు కావాలి'
రాయితీ ఉల్లి కోసం కర్నూలు రైతు బజారులో ఉదయం 4 గంటల నుంచే నగర వాసులు బారులు తీరారు. కేజీ సరిపోవడం లేదని రెండు కిలోలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
కర్నూలులో ఉల్లి కోసం ప్రజల కష్టాలు