ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ONION FARMERS: ఉల్లి కొనండి.. కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

కర్నూలులో ఉల్లి కార్మికుల(onion farmers) అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. మార్కెట్​లో ఉల్లి విక్రయాలు ప్రారంభించాలని కోరుతూ.. నిరసన(protest) ప్రదర్శన చేపట్టారు.

ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించాలని అర్ధనగ్న ప్రదర్శన
ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించాలని అర్ధనగ్న ప్రదర్శన

By

Published : Oct 1, 2021, 4:47 PM IST

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ (kurnool agriculture market)లో ఉల్లి విక్రయాలు ప్రారంభించాలని కార్మికులు వినూత్న పద్దతిలో ఆందోళన(protest) చేశారు. మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించాలని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మార్కెట్‌ యార్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ(rally) నిర్వహించారు. 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఉపాధి కొల్పోయామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మార్కెట్‌ ప్రారంభించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.

రైతుల ఆవేదన..

గత 20 రోజులుగా మార్కెట్ కొనుగోళ్లు నిలిపివేయడంతో(onion farmers) ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనామ్(enam) కొనుగోళ్లకు కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, తమిళనాడు తదితర మార్కెట్లకు కొందరు ఉల్లి తీసుకెళ్లినప్పటికీ.. క్వింటా 250 నుంచి 800 రూపాయలు మాత్రమే పలికిందని ఆవేదన చెందుతున్నారు. రవాణా ఛార్జీలు, ఏజంట్లకు కమీషన్ పోగా.. అప్పులతో ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు(farmers) అంటున్నారు.

ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించాలని అర్ధనగ్న ప్రదర్శన

ఇదీచదవండి.

PAWAN KALYAN: రాజమహేంద్రవరంలో పవన్‌కల్యాణ్‌ శ్రమదానం వేదిక మార్పు

ABOUT THE AUTHOR

...view details