కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు నూతన వసతి సముదాయాన్ని నిర్మిస్తున్నారు. గణేష్ సదన్ పేరిట దాదాపు రూ.43 కోట్లతో నాలుగు బ్లాక్‌ల్లో 224 గదుల నిర్మాణం సాగుతోంది. వసతి సముదాయంలోని సీ బ్లాక్‌లో రిసెప్షన్, రెస్టారెంట్ సదుపాయాలు కల్పించనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ఐదెకరాలు స్థలాన్ని కేటాయించారు. అంతర్గత రహదారులు, పచ్చని చెట్లను పెంచి పార్కింగ్‌ను తీర్చిదిద్దనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కావడం వల్ల దేశం నలుమూలల నుంచి శ్రీశైలానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ నూతన సముదాయంతో యాత్రికుల వసతి కష్టాలు తీరనున్నాయి.
దాతలకు 45 రోజులు వసతి ఉచితం