ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​.. హైదరాబాద్​లో చికిత్స - వైకాపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వార్తలు

రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్​కు పాజిటివ్​ అని తేలింది. చికిత్స కోసం హైదరాబాద్​లోని ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు.

Nandikotkur MLA Arthur
Nandikotkur MLA Arthur

By

Published : Oct 5, 2020, 9:55 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆర్థర్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 2వ తేదీన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. కరోనా సోకిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులతో కలిసి పరీక్షలు చేయించుకున్నారు.

పరీక్షల్లో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి, మనవడికి సైతం పాజిటివ్​ అని తేలింది. చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సామాజిక మాధ్యమంలో ఎమ్మెల్యేనే స్వయంగా ప్రకటించారు. ప్రజలు కరోనా బారినపడకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details