ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మున్సిపల్​ ఎన్నికల పోరు.. ఇంటింటికీ ప్రచార హోరు - municipal election campaign news

నగర, పురపాలక ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రాంతాల వారీగా ప్రణాళికాబద్ధంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. తెదేపా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తమను గెలిపిస్తే చేసే పనుల గురించి చెబుతూ.. ఓట్లు వేయాలని కోరుతున్నారు.

municipal election campaign
ఇంటింటికీ ప్రచార హోరు

By

Published : Mar 1, 2021, 3:32 PM IST

మున్సిపల్​ ఎన్నికల ప్రచార జోరు మొదలైంది. కర్నూలు నగరంలోని 41వ వార్డులో తెదేపా అభ్యర్థి పార్వతమ్మ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. కాలనీలోని సమస్యలను స్థానికులు.. పార్వతమ్మ దృష్టికి తీసుకువచ్చారు. నగర పాలక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే అన్నీ సమస్యలు పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.

అనంతపురం

కదిరి మున్సిపాలిటీపై మరోసారి తెదేపా జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయని మండిపడ్డారు. వాలంటీర్లను వాడుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని వెంకట ప్రసాద్ అన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకుడు చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పురపోరు ప్రచారంలో... జోరు పెంచిన అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details