తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. కర్నూలులోని పుష్కర ఘాట్లను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తుంగభద్ర పుష్కరాలకు రూ.200 కోట్లు
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని... జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కర్నూలులో పర్యటించిన ఆయన తుంగభద్ర పుష్కరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గుండ్రేవుల, రాజోలిబండ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు గుర్తు చేశారు. గుండ్రేవుల ప్రాజెక్టుపై తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలతో మాట్లాడాల్సి ఉందన్నారు. రాయలసీమ కరవు నివారణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ప్రకాశం జిల్లాలో 15 టీఎంసీల నీటి నిల్వ కోసం మూడు బ్యారేజీల నిర్మాణాలు, గోదావరి నీటిని రాయలసీమకు తరలించటం తదితర కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సామర్థ్యాన్ని 6 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. తుంగభద్ర పుష్కరాల కోసం 2 వందల కోట్ల రూపాయలు కేటాయించామని... కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు.