ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రుల సమక్షంలో రసాభాస.. బైరెడ్డి వర్సెస్ ఆర్థర్

కర్నూలు జిల్లా ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలతో మంత్రులు బుగ్గన, బొత్స, జయరాం, అనిల్​కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం కొనసాగుతుండగా నందికొట్కూరు నియోజకవర్గ నాయకుల మధ్య అభ్యర్థుల ఎంపికపై విభేదాలు తలెత్తాయి.

By

Published : Feb 3, 2021, 4:14 PM IST

Updated : Feb 3, 2021, 4:49 PM IST

కర్నూలు జిల్లా ముఖ్య నేతలతో మంత్రుల సమావేశం
కర్నూలు జిల్లా ముఖ్య నేతలతో మంత్రుల సమావేశం

మంత్రుల సమక్షంలో రసాభాస.. బైరెడ్డి వర్సెస్ ఆర్థర్

కర్నూలులో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్​కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. జిల్లాలోని ఎమ్మెల్యేలు ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక... ఏకగ్రీవలు, పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో మంత్రులు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.

బైరెడ్డి వర్సెస్ ఆర్థర్...

ఈ సమావేశం కొనసాగుతుండగా నందికొట్కూరు నియోజకవర్గ నాయకుల మధ్య అభ్యర్థుల ఎంపికపై విభేదాలు తలెత్తాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, నందికొట్కూరు వైకాపా భాధ్యుడు బైరెడ్డి సిధ్దార్థరెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య విభేదాలపై మంత్రులు చర్చిస్తుండగానే నేతలు గొడవకు దిగారు.

ఇదీ చదవండీ... 'ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదు'

Last Updated : Feb 3, 2021, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details