రాయలసీమ విశ్వవిద్యాలయంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని... అధికారుల తీరు మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. కర్నూలు నగరంలోని రాయలసీమ యూనివర్సిటీ అధికారులతో సమావేశమైన మంత్రి... సమస్యల పరిష్కారానికి హామీఇచ్చారు. అనంతరం రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల నాన్ టీచింగ్ స్టాఫ్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. యూనివర్సిటీల్లో అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్సిటీల అధికారులు తీరు మార్చుకోవాలి: మంత్రి సురేష్ - university officers Corruption
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని... తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సమావేశమైన మంత్రి... సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
![వర్సిటీల అధికారులు తీరు మార్చుకోవాలి: మంత్రి సురేష్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4231914-1077-4231914-1566653957440.jpg)
మంత్రి సురేష్