రాష్ట్రవ్యాప్తంగా 120 పట్టణాల్లో కనీసం ఒక్క నగర వనాన్ని అయినా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది కొత్తగా పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్తగా నగరవనాల్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. 18 కోట్ల రూపాయల వ్యయంతో 220 ఎకరాల్లో ఈ నగరవనాలను అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు.
120 పట్టణాల్లో నగర వనాలు: మంత్రి పెద్దిరెడ్డి
Minister Peddireddy: రాష్ట్రంలోని 120 పట్టణాల్లో కనీసం ఒక్క నగరవనాన్ని అయినా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్తగా నగరవనాల్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సచివాలయంలో అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో తెలిపారు.
Minister Peddireddy
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 23 నగరవనాలు, 7 టెంపుల్ ఎకో పార్కులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా.. నగరవనాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్టు మంత్రి తెలిపారు. నగరవనం, టెంపుల్ ఎకో పార్కుల అభివృద్ధి కోసం 2022-23 లో రూ.14.94 కోట్లు కేటాయించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:Yanamala: లంచాలపై జగన్ వ్యాఖ్యలు.. అతిపెద్ద జోక్: యనమల