కర్నూలు నగరంలోని పురావస్తు శాఖ మ్యూజియంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాణీమోహన్ సందర్శించారు. మ్యూజియంలోని ప్రాక్ చరిత్ర, మధ్య రాతియుగం, బృహత్ శిలాయుగం పనిముట్లు, గొడ్డళ్లు, వడిసెల రాయి, మట్టి బొమ్మలు, రోమన్, శాతవాహన, ఇక్ష్వాకుల నాణేలు, సింహ అవధాన జాతక పెన్సిల్ చిత్రకల, బ్రిటిష్-ఇండియా వెండి నాణేలు, కుతుబ్ సహరి వెండి నాణేలు తదితర వస్తువులను పరిశీలించారు.
పురావస్తు శాఖ మ్యూజియంను సందర్శించిన మంత్రి బుగ్గన - Buggana visits the Archaeological Museum News
పురావస్తు శాఖ మ్యూజియంను మంత్రి బుగ్గన, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాణీమోహన్ సందర్శించారు. మ్యూజియంలో భద్రపరిచిన పలు వస్తువు, చిత్రాలను వీరిరువురు పరిశీలించారు.

మ్యూజియంను సందర్శించిన మంత్రి బుగ్గన