ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఖర్చు చేసింది రూ.18వేల కోట్లే.. లెక్కల్లో మాత్రం 70 శాతం పనులు' - మంత్రి అనిల్ కుమార్ తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుపై తెదేపా నేతలు అబద్ధాలు చెబుతున్నారని మంత్రి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్చు చేసింది కేవలం రూ.18వేల కోట్లు అయితే..లెక్కల్లో మాత్రం 70శాతం పనులు పూర్తి చేశామని చెప్పటం హాస్యాస్పదమన్నారు.

minister anil kumar
minister anil kumar

By

Published : Nov 2, 2020, 8:20 PM IST

పోలవరం ప్రాజెక్టుపై తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.18వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. లెక్కల్లో మాత్రం 70 శాతం పనులు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కర్నూలులో బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి అనిల్​తో పాటు మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.

రాయలసీమకు సీఎం జగన్మోహన్ రెడ్డి నీళ్లివ్వటానికి ప్రయత్నిస్తుంటే...దానిపై కనీసం చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. ఎంతసేపు అమరావతి గురించి మాట్లాడటం తప్పా...మరే ఆలోచన లేదన్నారు. బీసీలకు అన్ని విధాలా వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి జయరాం అన్నారు.

ఘాట్లను పరిశీలించిన మంత్రి

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాల సందర్భంగా నిర్మిస్తున్న ఘాట్లను జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి

చిన్నారిని తీసుకెళ్లిన పోలీసులు..ఆగిన తల్లి గుండె

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details