కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందున జిల్లా అధికారులతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష సమావేశం నిర్వహంచారు. జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ వీరపాండియన్, వైద్య అధికారులతో చర్చించారు. రెడ్ జోన్ల పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని సామాజిక దూరం పాటించి లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండాలని సూచించారు.
రెడ్ జోన్లపై మరింత దృష్టి: మంత్రి ఆళ్ల నాని - ఏపీలో కరోనా మరణాల వార్తలు
కర్నూలు జిల్లాలో 37 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
minister alla nani