"రాబోయే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులే... బూత్ అధికారులు" - కర్నూలు లేటెస్ట్ అప్డేట్స్
కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులనే బూత్ అధికారులుగా నియమిస్తారని ఎమ్మెల్యే అన్నారు.
MLA Balanagireddy comments: కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలకు లేని పవర్ జగన్ వాలంటీర్లకు ఇచ్చారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ప్రజలెవరూ సమస్యల పరిష్కారం కోసం.. తమ వద్దకు రావడం లేదన్న ఆయన... రాబోయే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులనే బూత్ అధికారులుగా నియమిస్తారని అన్నారు. మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో నిర్వహించిన వాలంటీర్ల సత్కారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనం: చంద్రబాబు