ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఘనంగా రాఘవేంద్రుని మహారథోత్సవం - మంత్రాలయం రాఘవేంద్ర స్వామి

మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 351వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ స్వామి ఊరేగింపు నిర్వహించారు. యువత భక్తినృత్యాలు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సంప్రదాయ వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

ఘనంగా రాఘవేంద్రుని మహారథోత్సవం
ఘనంగా రాఘవేంద్రుని మహారథోత్సవం

By

Published : Aug 15, 2022, 8:57 AM IST

మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 351వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉత్తరారాధనోత్సవంలో భాగంగా మహా రథోత్సవాన్ని పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రహ్లాదరాయలను శ్రీరామచంద్రమూర్తి రూపంలో అలంకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ స్వామి ఊరేగింపు నిర్వహించారు. యువత భక్తినృత్యాలు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సంప్రదాయ వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవమూర్తి, స్వామి బృందావనానికి పీఠాధిపతి రంగులు చల్లి వసంతోత్సవం నిర్వహించారు. హెలికాప్టర్‌ ద్వారా మహా రథంపై పూలవర్షం కురిపించారు.

.

ABOUT THE AUTHOR

...view details