కర్నూలు సమీపంలోని బస్తిపాడు గ్రామంలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. చిన్న దస్తగిరి అనే వ్యక్తి గ్రామంలోని ఓ టిఫిన్ సెంటర్లో అల్పాహారం చేస్తుండగా... అదే గ్రామానికి చెందిన వ్యక్తి కొడవలితో దస్తగిరి తలపై దాడి చేశాడు. హత్య చేసిన వ్యక్తికి దస్తగిరికి కొన్ని సంవత్సరాల క్రితం పాత కక్షలు ఉన్నట్లు మృతుని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు సమీపంలో దారుణం.. ప్రత్యర్థి దాడిలో వ్యక్తి హతం - కర్నూలులో వ్యక్తి హత్య
కర్నూలు సమీపంలోని బస్తిపాడు గ్రామంలో ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన ప్రత్యర్థి.. దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని స్థానికులు అంటున్నారు.
man killed at karnool