ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Road accident: పెళ్లింట విషాదం... శుభలేఖలు పంచేందుకు వెళ్లి..! - కర్నూలు జిల్లాలో రోడ్డుప్రమాదం. కాబోయే వరుడు మృతి

Road accident: సంతోషంగా పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన కాబోయే వరుడిని రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. వారం రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు.. ఊహించని రీతిలో ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు. దీంతో.. పెళ్లి వేడుకలతో ఆనందంగా ఉండాల్సిన ఇంట.. పెను విషాదం నెలకొంది.

Man dead in road accident
రోడ్డుప్రమాదంలో వరుడు మృతి

By

Published : May 11, 2022, 3:33 PM IST

Road accident: కర్నూలు జిల్లా మంత్రాలయంలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట.. అంతులేని విషాదం నెలకొంది. మరో వారంలో వివాహం చేసుకుని సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన భీమేశ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ నెల 18 తేదీన పెళ్లి వేడుకలు నిర్వహించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో బంధువులకు ఆహ్వాన పత్రికలు పంచేందుకు బైక్‌పై వెళ్లుతున్న బీమేశ్‌ను... ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్టు వద్ద బోలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో భీమేశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దారణ సంఘటనతో.. పచ్చని తోరణాలతో కళకళలాడాల్సిన పెళ్లి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details