రాళ్లతో కొట్టి మహిళ దారుణ హత్య.. ఆ తర్వాత తానూ.. - కర్నూలు జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Man commits suicide by killing woman: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలికొంది. ఆస్పరి మండలం ముత్తుకూరులో మహిళను ఆమె బావ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానూ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Man commits suicide by killing woman: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైంది. లింగమ్మ (52) అనే మహిళను ఆమె బావ హనుమంతు బుధవారం అర్ధరాత్రి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతడు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హనుమంతు ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని.. లింగమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడని.. డబ్బుల కోసం తల్లిని కూడా వేధించేవాడని హనుమంతు కుమారుడు మధు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆస్పరి పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: Baby at roadside: "నేనేం పాపం చేశానమ్మ... నన్నేందుకు ఇక్కడ వదిలేశారు"