ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న వైకాపా నేత

నంద్యాలలో వైకాపా నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, వైకాపాకు చెందిన మరో నాయకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. రౌడీలకు ఎమ్మెల్యే అండగా ఉంటున్నాడని, రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసును సీబీఐకి అప్పగిస్తే..వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు.

YSRCP
YSRCP

By

Published : Sep 24, 2022, 8:26 PM IST

నంద్యాల అధికార వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, అదే పార్టీకి చెందిన మరో నాయకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరోకరు సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. పోలీసు కానిస్టేబుల్ సురేంద్రను హత్య చేసిన రౌడిలను కడప కేంద్ర కారాగారం వెళ్లి ఎమ్మెల్యే శిల్పా పరామర్శించినట్లు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అటు, కడప కేంద్ర కారాగారానికి వెళ్లినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని..లేదంటే మలికిరెడ్డి తప్పుకోవాలని ఎమ్మెల్యే శిల్పా సవాలు విసిరారు.

సవాళ్లతో వేడెక్కిన నంద్యాల రాజకీయంలో తాజాగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార దర్పంతో ఎలాంటి ఆధారాలు చూపినా ఎమ్మెల్యే అవాస్తవమని అంటున్నాడని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. నంద్యాలలో రౌడీలకు ఎమ్మెల్యేనే అండగా నిలబడుతున్నాడని చెప్పారు. మూడేళ్ళలో 15 నుంచి 20 హత్యలు జరిగాయని.. శాంతి భద్రతలు లోపించడానికి ఎమ్మెల్యే కారణమన్నారు. పోలీసు కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసును సీబీఐకి అప్పజెప్పగిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు. లేదంటే హైకోర్టులో రిట్ వేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెల్దామా అని సవాల్ విసిరారు. నంద్యాలలో శాంతిభద్రతల కాపాడలేకపోతే ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి రాజీనామా చేయాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

అధికారపార్టీ నేతల ఆరోపణలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details