కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేకంగా అంబులెన్సులు తీసుకొని అందులో కరోనా బారినపడి బాధ అనుభవిస్తున్నట్లు నటిస్తున్న వ్యక్తిని ఉంచారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనవసరంగా తిరుగుతున్న ప్రజలను పోలీసులు పట్టుకొని ఆ అంబులెన్సులో ఎక్కిస్తున్నారు.
కరోనా లక్షణాలతో చిత్రీకరణలో ఉన్న వ్యక్తిని చూసి వారు అంబులెన్స్ ఎక్కేందుకు భయపడుతున్నారు. రోడ్డు మీద వీధుల్లో అనవసరంగా తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారిని పట్టుకొని క్వారెంటైన్లో ఉంచుతామని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు.