ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవో-30 రద్దు కోరుతూ కార్మిక సంఘాలు ఆందోళన - labour unions agitation over go-30

కర్నూలు వ్యవసాయ మార్కెట్ పై విడుదల చేసిన జీవో-30కి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాంటూ సీఐటీయూ నాయకులు వినతి పత్రం అందించారు.

market yard labor unions agitation at kurnool
జీవో-30 రద్దు కోరతూ కార్మిక సంఘాలు ఆందోళన

By

Published : Jun 9, 2021, 3:44 PM IST

కర్నూలు వ్యవసాయ మార్కెట్ విభజన వద్దంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్​ను రెండుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ను విడుదల చేయడంతో కార్మికులు ధర్నాకు దిగారు. రాజకీయ నాయకుల ప్రాబల్యం, పదవుల కోసమే జీవో విడుదల చేశారని వారు ఆరోపించారు.

జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మార్కెట్లను ఏర్పాటుచేసి.. పాణ్యం నియెజకవర్గంలోని మార్కెట్​ను ఓర్వకల్లులో ఏర్పాటు చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈ సందర్భంగా తాజాగా తెచ్చిన జీవో రద్దు కోరుతూ నాయకులు మార్కెట్ యార్ట్ కార్యదర్శి జయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details