ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

fake cases: తప్పుడు కేసులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తాం: కర్నూలు ఎస్పీ

కర్నూలు జిల్లా అహోబిలం గ్రామంలో ఓ పొలం తగదా విషయంలో తప్పుడు కేసులు పెట్టి బాధితులను భయబ్రాంతులకు గురిచేసిన పది మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్​రెడ్డి తెలిపారు. తప్పుడు కేసులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో అర్థనగ్న ఫొటోలు తీసి డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురిని కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

sp sudheer reddy fire on fake cases
కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి

By

Published : Aug 23, 2021, 6:00 PM IST

తప్పుడు కేసులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్​కుమార్​రెడ్డి తెలిపారు. ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో ఓ పొలం తగదా విషయంలో తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసిన పదిమందిని అరెస్టు చేశారు. బాధితులు.. పొలం వదిలి వెళ్లకపోతే తామే గాయపర్చుకొని అట్రాసిటి కేసులు పెడతామని ముద్దాయిలు బెదిరించినట్లు ఎస్పీ వివరించారు. ఈకేసులో అక్రమంగా అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేసిన వారిని సైతం అరెస్టు చేశామని ఆయన పేర్కొన్నారు.

అర్థనగ్న ఫొటోలతో వసూళ్లకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

కర్నూలు నగరంలో అర్థనగ్న ఫొటోలు తీసి డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. బాధితులకు మహిళతో ఫోన్ చేయించి.. ఇంటికి పిలిపించుకొని అర్థనగ్న ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడేవారని ఎస్పీ తెలిపారు. ఈకేసులో ముద్దాయిలను రిమాండ్​కు తరలించామన్నారు. కర్నూలు లేబర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని అర్థనగ్న ఫొటోలు చూపించి రూ. 1.20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. రాంరహీంనగర్​కు చెందిన మరో వ్యక్తిని ఇంటికి పిలిపించుకొని అర్థనగ్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారన్నారు. అతని వద్ద రూ. 8 లక్షల విలువ చేసే ప్రాంసరీ నోట్లు, చెక్కులను తీసుకున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. దీంతో ముమ్మర విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఇదీ చదవండి..

RRR: 'ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపాకు వచ్చే సీట్లెన్నంటే..?'

ABOUT THE AUTHOR

...view details