కర్నూలు జిల్లాలో కరోనా కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. రోజురోజుకూ జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో... నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. రెడ్‌జోన్, హైరిస్క్ అలర్ట్ ప్రాంతాల ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఈనెల 20 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జిల్లాలో పరిస్థితిని సమీక్షిస్తున్నామంటున్నారు.
'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు' - ఏపీ కరోనా వార్తలు
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. వ్యాప్తి నివారణ కోసం కట్టుదిట్ట చర్యలు చేపట్టామని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. రెడ్‌జోన్, హైరిస్క్ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసులు పెరుగుతున్న కారణంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయంటున్న ఎస్పీ ఫక్కీరప్పతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఎస్పీ ఫక్కీరప్ప