కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే బస్సులు, దుకాణాలు మూతపడ్డాయి. ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోతోంది. ఆటోలు ఇష్టా రాజ్యంగా తిరుగుతుండటంతో ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రేపటి నుంచి రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ ఏకం కావాలని కోరారు.
'రోడ్లపైకి వచ్చారంటే కేసులు నమోదు చేస్తాం' - ఏపీ లాక్డౌన్ వార్తలు
కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.... జనాలను బయటకు రానీయకుండా కర్నూలు జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేస్తున్నారు. రోడ్డు ఎక్కితే కఠిన చర్యలు తప్పవని ఆటో డ్రైవర్లను డీఎస్పీ ఫకృద్దీన్ హెచ్చరించారు.
dsp