కర్నూలులో ప్రతి రోజూ 50 టన్నుల పొడి చెత్త పోగవుతోంది. ఇందులో 25 టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. మురుగుకాలువలు, హంద్రీ, తుంగభద్ర నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి జీవరాశులకు హాని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం కొంతమేర తగ్గినా పూర్తిస్థాయిలో నివారించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం "ప్లాస్టిక్ హఠావో- కర్నూలు బచావో" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
curb plastic : 'ప్లాస్టిక్ హఠావో- కర్నూలు బచావో'... ప్లాస్టిక్‌ను అరికట్టేందుకు నూతన కార్యక్రమం - kurnool latest news
ప్లాస్టిక్ వ్యర్థాలు మానవాళికి ముప్పు కలిగిస్తాయని తెలిసినా వాటి వాడకం మాత్రం తగ్గటంలేదు. ప్లాస్టిక్ వల్ల గాలి, నీరు, నేల కలుషితం అవుతున్నాయి. డంపింగ్ యార్డులే కాక జలాశయాల్లోనూ ప్లాస్టిక్ పేరుకుపోతోంది. పూర్తిస్థాయిలో అరికట్టేందుకు కర్నూలు నగరపాలక సంస్థ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
![curb plastic : 'ప్లాస్టిక్ హఠావో- కర్నూలు బచావో'... ప్లాస్టిక్‌ను అరికట్టేందుకు నూతన కార్యక్రమం కర్నూలులో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13372637-984-13372637-1634385813744.jpg)
కర్నూలులో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమం
ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్పరిణామాలపై నగరంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మార్కెట్ల వద్ద ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్తున్న వారికి మున్సిపల్ అధికారులు, సిబ్బంది పర్యావరణహిత కాటన్ బ్యాగులను ఉచితంగా అందిస్తున్నారు. పొదుపు సంఘాల్లోని మహిళలతో మరిన్ని సంచులు తయారు చేయించి, పంపిణీ చేయిస్తామని కర్నూలు మేయర్, కమిషనర్ చెప్పారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ సంచులు విక్రయించినా, వినియోగించినా పెద్ద మొత్తంలో జరిమానా విధించాలని అధికారులు భావిస్తున్నారు.
కర్నూలులో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమం
ఇదీచదవండి.