కర్నూలు వ్యవసాయ మార్కెట్ వద్ద హమాలీలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. లాక్డౌన్ తీసివేసినా… అధికారులు మాత్రం మార్కెట్‌ను తెరవకుండా రైతులకు, కార్మికులకు అన్యాయం చేస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. వెంటనే మార్కెట్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని చెప్పారు.
కర్నూలు వ్యవసాయ మార్కెట్ ప్రారంభించాలని హమాలీల ధర్నా - citu protest at kurnool market latest news
కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభించాలంటూ హమాలీలు ధర్నాకు దిగారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సీఐటీయూ అండగా నిలిచారు. అధికారులు మార్కెట్ తెరవకుండా వీటిపై ఆధార పడ్డ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు.
వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభించాలంటూ హమాలీలు ధర్నా