ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం' - కర్నూలు జిల్లాలో కొవిడ్ కేంద్రాలు

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించనున్న జర్మన్ షెడ్ల తాత్కాలిక ఆస్పత్రి నిర్మాణ పనులను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పరిశీలించారు.

corona cases at kurnool district

By

Published : May 18, 2021, 9:28 PM IST

కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కర్నూలు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రామ సుందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించనున్న జర్మన్ షెడ్ల తాత్కాలిక ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

కర్నూలు ఆస్పత్రితో పాటు నగర శివారులోని టిడ్కో హౌసింగ్ కాలనీలో మరో తాత్కాలిక ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణ పనులను ఇన్‌చార్జి కలెక్టర్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రిలోని కంటి వైద్య శాల విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంద ఆక్సిజన్ పడకలను ఆయన పరిశీలించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 21,320 కరోనా కేసులు, 99 మరణాలు నమోదు

ABOUT THE AUTHOR

...view details