కర్నూలు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఫలితంగా.. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 85కు పెరిగింది. పరీక్షలకు పంపిన 55 నమూనాలకు సంబంధించిన ఫలితాలు ఇవాళ వచ్చాయని కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. వీరిలో 54 మందికి నెగటివ్ రాగా కర్నూలు పట్టణానికి చెందిన ఒక్కరికి పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ చెప్పారు. ఈ వివరాలను వైద్య అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
కర్నూలులో 85కు చేరిన కరోనా కేసులు - కర్నూలు కరోనా వార్తలు
కర్నూలు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పరీక్షలకు పంపిన 55 నమూనాల్లో 54 నెగటివ్ రాగా, ఒకటి పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 85కి చేరింది.
కర్నూలులో 85కు చేరిన కరోనా కేసులు