అట్టపెట్టెలతో అద్భుతాలు... ఆకట్టుకుంటున్న కళాకృతులు - kurnool guy make wonderswith cardboard
సుందరమైన కట్టడాలను అట్టపెట్టెలతో తయారు చేస్తున్నాడు కర్నూల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థి మంజునాథ్. ఇప్పటివరకు అట్టపెట్టెలను ఉపయోగించి ఎన్నో రకాలు నమూనాలను తయారు చేశాడు. కంప్యూటర్ టేబుల్, కొండారెడ్డి బురుజు, నాగార్జునసాగర్, టైటానిక్ షిప్, సత్య సాయి బాబా సమాధి, అపార్ట్ మెంట్స్తో పాటు తాను చదువుకున్న పాఠశాల భవనం, తన తండ్రి వాడుతున్న వాహనాన్ని సైతం అట్టముక్కల తో తయారు చేయడం విశేషం. ఇవన్నీ దాచుకునేందుకు ఓ గదిని సైతం ఏర్పాటు చేశారు అతని తల్లిదండ్రులు.