కృష్ణానది వరద ప్రవాహానికి నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాల్లోని పలు గ్రామాలు నీటమునిగాయి. పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాలను, ఇళ్లను వరదనీరు చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల నీటిమట్టం భారీగా పెరుగుతోంది. మక్తల్ మండలంలోని ప్రధాన ఆలయాలు, పసుపుల దగ్గర వల్లభాపురం, కుర్మిగడ్డ, ముస్లైపల్లి, నారదగడ్డ ఆలయాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కృష్ణ మండలంలోని భీమాశంకర్ ఆలయం, దత్తాత్రేయ ఆలయాలు నీట మునిగాయి.
జల దిగ్బంధంలో కృష్ణా పరివాహక ప్రాంతాలు - మక్తల్
అనూహ్య వరదతో కృష్ణమ్మ.. ముంపు ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న వరద కారణంగా.. తెలంగాణ నారాయణపేట జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
krishna river