ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలు జిల్లాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి: కోట్ల - కరోనా వార్తలు

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో అత్యవసర పరిస్థితి ఏర్పడిందన్న కోట్ల.. పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక బృందాన్ని పంపాలని కేంద్రాన్ని కోరారు. పరిస్థితి చేయిదాటక ముందే చర్యలు చేపట్టాలన్నారు.

kotla surprakash reddy
కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.

By

Published : Apr 26, 2020, 10:13 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తిపై కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్‌కు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడిందని లేఖలో తెలిపారు. కర్నూలు జిల్లాపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న కోట్ల.. కరోనా కట్టడికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో కరోనా పరిస్థితి పరిశీలనకు ప్రత్యేక బృందాన్ని పంపాలని కోరారు. పరిస్థితి చేయిదాటక ముందే కేంద్ర వైద్యశాఖ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details