కర్నూలు జిల్లా ఆదోనిలో కర్ణాటక బస్ కండక్టర్ తిప్పేస్వామి గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఆదోని మండలం ధనపురం దగ్గర కండక్టర్ అస్వస్థతకు గురై.. బస్సులో కుప్పకులాడు. ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పడంతో.. బస్సును ఆదోని ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కండక్టర్ మృతి చెందాడని.. బస్సు బెంగళూర్ నుంచి మంత్రాలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని డ్రైవర్ రామ్ లీలా తెలిపారు.