ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆపదలో ఉంటే వస్తారు... చేయూతనిస్తారు - jyothi friends circle group

విభిన్న రంగాలకు చెందిన వారంతా మిత్ర బృందంగా ఏర్పడ్డారు. ఎవరికీ ఏ సమస్య వచ్చినా ఈ బృందం వాలిపోతుంది. వారి సమస్యలు తెలుసుకుని తోచిన సహాయం అందిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఆపదలో ఉంటే వస్తారు... చేయూతనిస్తారు
ఆపదలో ఉంటే వస్తారు... చేయూతనిస్తారు

By

Published : Dec 16, 2019, 3:40 PM IST

Updated : Dec 26, 2019, 4:40 PM IST

ఆపదలో ఉంటే వస్తారు... చేయూతనిస్తారు

ప్రకాశం జిల్లాకి చెందిన కొంతమంది ఓ బృందంగా ఏర్పడి... చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. గత పదేళ్లుగా ఎంతోమంది అభ్యాగ్యులకు ఈ బృందం ఎన్నో సేవలందిస్తోంది.

ఎలా మెుదలైందంటే...
కర్నూలు పట్టణంలో వరదల కారణంగా చాలామంది సర్వం కోల్పోయారు. బాధితుల ఇబ్బందులను చూసిన ఈ స్నేహితులంతా... ఓ బృందంగా ఏర్పడి... వారికి చేయూతనివ్వాలని సంకల్పించారు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ పేరుతో ఒక ఫౌండేషన్​ను ఏర్పాటు చేశారు. ఎవరికి వారు తోచినంత చందాలు వేసుకొని.. అగ్నిప్రమాద బాధితులు, మానసిక రోగులు, వృద్ధులు, దివ్యాంగులకు నిత్యావసర, నగదు, దుస్తులు, దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్​షిప్​లు, పేద ఆడపడుచులకు మంగళ సూత్రాలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం ఇలా అవసరమైన వారందరికీ చేయుతనిస్తున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా... విద్య, వైద్య, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే తమ దృష్టికి తీసుకువస్తే ఆదుకుంటామని చెబుతున్నారు. వీరి సేవలు మరింత విస్తరించి... మరింత మందికి చేయూతనివ్వాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

Last Updated : Dec 26, 2019, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details