Kurnool Mayor Issue: కర్నూలు మేయర్ బీవై రామయ్య.. మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో సామాజిక న్యాయభేరీ బస్సుయాత్రకు ప్రజలు రాలేదంటూ కొన్ని వార్తాపత్రికలు ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. ఆయా మీడియా ప్రతినిధుల వీపు పగలగొడతానని మేయర్ హెచ్చరించారు. జగన్.. ముఖ్యమంత్రిగా ముడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైకాపా జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కలిసి మేయర్ కేక్ కట్ చేసిన సందర్భంగా మేయర్ ఈ కామెంట్స్ చేశారు.
కర్నూలు మేయర్ తీరును ఖండించిన జర్నలిస్టులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ - journalists protest at Kurnool collectorate
Kurnool mayor on Media: మీడియాపై కర్నూలు మేయర్ బీవై రామయ్య అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. మేయర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో మీడియా వీపు పగలగొడతానని మేయర్ హెచ్చరించారు.
మేయర్ వ్యాఖ్యలపై విలేకర్ల నిరసన: మీడియాపై మేయర్ బీవై రామయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. మేయర్ రామయ్య విలేకరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు మీడియా ప్రతినిదులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు 'చొక్కాలు విప్పి వీపు పగలగొట్టండి' అని నిరసన తెలిపారు. సభలు నిర్వహించలేని వారు.. వాస్తవాలు రాసే విలేకరులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. మేయర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: