ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

THREE CAPITALS: 'మూడు రాజధానులకే మా మద్ధతు.. అందుకు ఎంతవరకైనా వెళ్తాం' - అమరావతి

ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు తాము మద్దతు ఇస్తున్నామని అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు కర్నూలు​లో అన్నారు. రాష్ట్రంలో ఒకే రాజధాని ఉంటే అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమవుతుందని తెలిపారు.

అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు
అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు

By

Published : Nov 12, 2021, 10:47 PM IST

రాష్ట్రంలో ఒకే రాజధాని ఉంటే అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమవుతుందని అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు కర్నూలు​లో అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కర్నూలుకు హైకోర్టు కోసం తాము కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైకోర్టు కోసం ఎంతవరకైనా పోరాటాలు చేస్తామని ప్రకటించారు.

'అధికార వికేంద్రీకరణ - మూడు రాజధానులు' ఏర్పాటు అనే అంశంపై ఈ నెల 15వ తేదీన కర్నూలులో సదస్సు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ సదస్సులో మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని మూడు రాజధానులు అంశంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని జేఏసీ నాయకులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details