కర్నూలు పాతనగరంలో చెత్తకు సంబంధించిన పన్నులు వసూలు చేయటానికి వెళ్లిన సచివాలయ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. పిల్లలకు రెండు రూపాయలు ఇవ్వటానికే ఇబ్బందిగా ఉందని ప్రతి నెలా రూ.60 ఎలా చెల్లించాలని మహిళలు నిలదీశారు.
'ఇళ్లు గడవడమే కష్టంగా ఉంది..పన్నులెలా కట్టాలి'
చెత్తకు సంబంధించిన పన్నులు వసూలు చేయడానికి వెళ్లిన సచివాలయ సిబ్బందికి పాతనగరం మహిళల నుంచి అనుకోని ప్రతిఘటన ఎదురైంది. కరోనా సమయంలో తినడానికి కష్టంగా ఉంటే పన్నులు ఎలా కట్టాలని ప్రశ్నించారు.
చెత్త పన్నులు
కరోనా సమయంలో తినటానికే కష్టంగా ఉందని... పన్నులు ఎలా కట్టాలని ఎదురుతిరిగారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి:jagananna houses: ఇల్లు పూర్తవ్వాలంటే.. అప్పులపాలు కావాల్సిందే(నా?)..!