IT RAIDS ON SKANDHANSHI OFFICES: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ.. స్కందాన్షి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు రైడ్ చేశారు. కర్నూలు నగరంలోని ఆ సంస్థ కార్యాలయాల్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడులు కొనసాగుతున్నందున.. కార్యాలయంలోకి ఇతరులెవ్వరినీ అనుమతించటం లేదు.
అనంతపురంలోనూ..
అనంతపురంలోని స్కందాన్షి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయంలోనూ.. ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కర్నూలు అధికారులు.. అనంతపురంలో తనిఖీలు చేపట్టారు.