ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT : 'ప్రభుత్వ ప్రతి చర్యనూ పిల్​తో సవాలు చేయలేరు'

భూ బదలాయింపు వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యవసాయ పరిశోధన కేంద్రమే కాదు వైద్య కళాశాల కూడా ముఖ్యమేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతి చర్యనూ పిల్‌తో సవాలు చేయడానికి వీల్లేదన్న ధర్మాసనం... తదుపరి విచారణను నవంబర్ 18 కి వాయిదా వేసింది.

హైకోర్టు విచారణ
హైకోర్టు విచారణ

By

Published : Oct 29, 2021, 5:13 AM IST

భూ బదలాయింపు వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాలను వైద్య కళాశాల నిర్మాణం కోసం బదలాయిస్తూ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాల పాలక మండలి చేసిన తీర్మానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్మానంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, ఎన్జీరంగా యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ప్రజలకు వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎంత ముఖ్యమో... వైద్య కళాశాల కూడా అంతే ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది . అవి రెండు ప్రజా సంక్షేమం కోసం ఉన్నాయని, వైద్య కళాశాలలు లేకపోతే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రభుత్వ ప్రతి చర్యనూ పిల్‌తో సవాలు చేయడానికి వీల్లేదంది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మరోచోట 50 ఎకరాలు ఇస్తుంది కదా అని పిటిషనర్లను ప్రశ్నించింది. తదుపరి విచారణను నవంబర్ 18 కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details