కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 'జగనన్న విద్యా దీవెన' కార్డులో లక్ష్మీ అనే విద్యార్థిని ఫోటోకు బదులుగా సినీ హీరో మహేష్‌బాబు చిత్రం రావడం చర్చనీయాంశమైంది. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన గంగమ్మ, సత్తన్నల కుమార్తె పరంపోగు లక్ష్మి.. స్థానికంగా ఉన్న సిద్దార్థ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదువుతోంది. ఆమెకు విద్యా దీవెన కింద 2019-057-145-21 సంఖ్యతో గుర్తింపు కార్డు మంజూరు చేశారు. కార్డులో పేరు, చిరునామా సక్రమంగానే ఉన్నప్పటికీ యువతి చిత్రానికి బదులు హీరో మహేష్‌బాబు ఫోటో ప్రచురితమైంది. కొన్ని కార్డుల్లో తప్పులు దొర్లాయని కమిషనర్ రఘనాథరెడ్డి వివరణ ఇచ్చారు.
'విద్యాదీవెన'కార్డులో హీరో మహేష్‌బాబు చిత్రం - latest updates of Jagannana vidyadivena
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 'జగనన్న విద్యాదీవెన' కార్డులో లక్ష్మీ అనే విద్యార్థిని ఫోటోకు బదులుగా సినీ హీరో మహేష్‌బాబు చిత్రం రావడం చర్చనీయాంశమైంది. దీనిపై కమిషనర్ రఘనాథరెడ్డి వివరణ ఇచ్చారు.
hero-mahesh-babu-photo-in-jagannana-vidyadivena-benfit-card
Last Updated : Feb 26, 2020, 7:42 AM IST