కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. మొత్తం 40 మండలాల్లో వర్షం పడింది. కొలిమిగుండ్ల, కర్నూలు, ప్యాపిలి, కల్లూరు మండలాల్లో వంకలు పొంగి పొర్లాయి. కొలిమిగుండ్ల మండలంలో అత్యధికంగా 93.4 మి.మీ.లు (9.3 సెంటీమీటర్లు) పడింది. కర్నూలులో 80.2 మి.మీ.లు, ప్యాపిలి 67.2, కల్లూరు 66, కృష్ణగిరి 40.6, సంజామల 36.8, బనగానపల్లి 35.2, నందవరంలో 32.2 మి.మీ.లుగా నమోదైంది.
శిరువెళ్లలో 31.4 మి.మీ.లు, ఆస్పరి 31.2, వెల్దుర్తి 28.2, సి.బెళగల్, బేతంచర్ల, గోస్పాడు 24.2, ఆదోని, పాణ్యం 20, చాగలమర్రి 19, పెద్దకడబూరులో 18.6 మి.మీ.లు కురిసింది. గోనెగండ్ల 18.4, కోసిగి 14.8, ఉయ్యాలవాడ 14.6, కౌతాళం, మిడుతూరు 14.2, వెలుగోడు 14, కోవెలకుంట్ల, హాలహర్వి 11.2, ఎమ్మిగనూరు, బండి ఆత్మకూరు 10.2, గూడూరు, డోన్ 10, మంత్రాలయం 9.8, శ్రీశైలంలో 9.2 మి.మీ.లుగా నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. మొత్తం 40 మండలాల్లో 897 మిల్లీమీటర్ల వర్షం కురవగా జిల్లా సగటున ఒక్కరోజే 16.6 మి.మీ.లు నమోదవడం విశేషం. ఈనెల సాధారణ వర్షపాతం 77.2 మి.మీ.లు కాగా ఇప్పటివరకు 131.7 మి.మీ.లుగా నమోదైంది. సాధారణానికి మించి 71 శాతం అధిక వర్షం పడింది.