కృష్ణా జిల్లా..కంచికచర్ల మండలం పెండ్యాల వద్ద తెలంగాణ నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 1140 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. మద్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకొని.. నిందితుడిని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నూజివీడు మండలం సిద్ధార్థ నగర్, ఓగిరాలతండా ప్రాంతాల్లో 135 లీటర్ల నాటుసారా, 2వేల లీటర్ల బెల్లం ఊట, 500 కిలోల బెల్లం ధ్వసం చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకుని.. ఆటోను సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు ఆదేశానుసారం సోదాలు నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
వత్సవాయి మండలం తాళ్లూరు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద 300 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. లింగాలపాడు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. టాటా ఏస్ వాహనంలో ఖమ్మం నుంచి మధిరకు మద్యం తరలిస్తుండగా.. చిల్లకల్లు ఎస్ఐ మహాలక్ష్మణుడు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనంలో ఎండిన కట్టెల కింద పేర్చిన మద్యం సీసాలు గుర్తించారు. స్వాధీనం చేసుకున్నారు.
ప్రత్యేక తనిఖీలు
పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎస్ ఈబీ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు . జనవరి 23 నుంచి ఈనెల 2వతేదీ వరకు అక్రమ మద్యం, ఇసుక, నగదు రవాణాలపై ప్రత్యేక దృష్టిపెట్టి 1728 కేసులు నమోదు వేసి.. 1262 మందిని అరెస్ట్ చేశారు. 211 వాహనాలు సీజ్ చేశారు. వీటిలో నాటు సారా తయారీ, మద్యం అక్రమ విక్రయిస్తున్న ఘటనల నిందితులు ఉన్నారు. ఎన్నికల నేపధ్యంలో 11 వేల 34 మందిని బైండోవర్ చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్క పోస్ట్ వద్ద బిల్లులు లేకుండా తరలిస్తున్న 2.47 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించారు . కడప జిల్లా ఎగువపల్లి చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో 35 లక్షల రూపాయల నగదు , కర్నూలు జిల్లా లో 36 లక్షల రూపాయల నగదును ఎటువంటి రశీదులు లేకుండా తరలిస్తుంటే ఎస్ ఈ బీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..