కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది(Tungabhadra River) ఉగ్రరూపం దాల్చింది. కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వస్తోంది. సుంకేసుల జలాశయానికి లక్షా 58 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో, అంతే మొత్తాన్ని శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) విడుదల చేస్తున్నారు. దీంతో కర్నూలు వద్ద తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. జూరాల నుంచి 8 వేల క్యూసెక్కులు సైతం వస్తుండటంతో లక్షా 66 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలంలో చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 861 అడుగులు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 109 టీఎంసీలు.
Rivers in Kurnool : తుంగభద్ర పరవళ్లు...నిండుకుండలా శ్రీశైలం జలాశయం - kurnool district news
ఎగువన కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) కర్నూలు జిల్లాలో నదుల ఉప్పొంగుతున్నాయి. ఓవైపు తుంగభద్రా నది పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది.
తుంగభద్ర పరవళ్లు...నిండుకుండలా శ్రీశైలం జలాశయం