ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరవళ్లు తొక్కుతున్న కుందూ.. నీట మునిగిన పరివాహక ప్రాంతాలు - water flow in kundu river news update

కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

heavy flood flow in kundu
పరవళ్లు తొక్కుతున్న కుందూ

By

Published : Sep 27, 2020, 11:14 AM IST

పరవళ్లు తొక్కుతున్న కుందూ
కుండపోతగా కురిసిన వర్షంతో కర్నూలు, కడప జిల్లాల మీదుగా ప్రవహించే కుందూ నది పరవళ్ళు తొక్కుతోంది. రెండు రోజుల కిందట 5 వేల క్యూసెక్కులకు పడిపోయిన వరద ప్రవాహం.. ఈరోజు ఉదయం 40 వేల క్యూసెక్కులకు పెరిగింది. అటు కర్నూలు ఇటు కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవటంతో.. కుందూ పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. కుందూ ఉద్ధృతంగా ప్రవహించడం, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు పెద్ద ఎత్తున రావడం నదీ పరివాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details