ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LAND SCAM IN KURNOOL: ప్రభుత్వ భూములను అప్పనంగా రాసిచ్చేశారు..! - కర్నూలు తాజా వార్త

GOVT LAND KABJA: కర్నూలు జిల్లాలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం వెలుగులోకి వచ్చింది. కొందరు వీఆర్వోల సహకారంతో కొత్తగా వచ్చిన అధికారి ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. జిల్లాలోని విలువైన భూములను.. ఇతర జిల్లాల్లో ఉండే వారికి రిజిస్ట్రేషన్ చేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు కనుగొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది.

GOVT LAND KABJA
GOVT LAND KABJA

By

Published : Feb 3, 2022, 8:51 PM IST

GOVT LAND KABJA: కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలంలో ప్రభుత్వ భూములను అప్పనంగా రాసిచ్చేశారు. ఇందులో ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ రామచంద్రరావు కీలక పాత్ర పోషించినట్లు వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నర కిందట వెల్దుర్తి నుంచి డిప్యూటీ తహసీల్దార్‌గా కృష్ణగిరికి వచ్చారు. అప్పటికే అక్కడ పనిచేసిన తహసీల్దార్‌ జాకీర్‌ పదవీవిరమణ పొందడంతో ఇన్‌ఛార్జిగా బాధ్యతలిచ్చారు. వెంటనే కార్యాలయం కేంద్రంగా దందాకు తెర తీశారు. కొందరు వీఆర్వోలు సహకారంతో ప్రభుత్వ భూముల ఆన్‌లైన్‌ ప్రక్రియకు తెరలేపారు. డబ్బుల విషయంలో సిబ్బందిని నమ్మకుండా తానే నేరుగా రైతులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకొన్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్లో పేర్లుమార్చి...

కృష్ణగిరి మండలం మన్నెకుంట రెవెన్యూ పరిధిలో 142 సర్వే నంబరులో ప్రభుత్వ భూమి ఉంది. దీనిని 142-ఏ,బీ,సీ,ఈ సబ్‌ డివిజన్లుగా మార్పు చేసి శ్రీకాకుళం జిల్లా వాసుల పేరిట అంతర్జాలంలో నమోదు చేసి అక్రమాలకు తెరతీశారు. సుమారు ఆరు మంది పేర్లతో 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు. ఇక్కడ ఎకరా రూ.5-6 లక్షలు పలుకుతోంది. రూ.2 కోట్ల మేర విలువైన ప్రభుత్వ భూమిని ఇతరులకు అప్పనంగా కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

  • పోతుగల్లు గ్రామ పంచాయతీ పరిధిలో 462 సర్వే నంబరులో ఉన్న పొలం గతంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో ఉంది. ఆ సంస్థ తరఫున ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం బినామీల పేరిట అంతర్జాలంలో నమోదు చేసి డబ్బులు దండుకొన్నట్లు తేలింది. 16 ఎకరాలకుపైగా కొందరు రైతుల పేర్లు ఎక్కించి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి.

కొండను పంచారు..

  • తొగర్చేడు గ్రామ పంచాయతీ పరిధిలో హంద్రీనీవా కాల్వ సమీపంలో 142 సర్వే నంబరులో ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఇక్కడ ఉన్న కొండ(తిప్ప)ను కొంత మంది పేరిట నమోదు చేశారు. సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమి పరాధీనమైంది.
  • హంద్రీనీవా కాల్వ ఉండటంతో ఇక్కడ ఎకరా రూ.10 లక్షల విలువ చేస్తోంది. ఎకరాకు ఒక్కొక్కరి నుంచి రూ.30-35 వేల చొప్పున వసూలు చేశారు. డబ్బులిచ్చివారికి ఆన్‌లైన్లో పేర్లు ఎక్కించడం.. ఆపై పాసుపుస్తకాలు ఇచ్చేలా భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
  • కటారుకొండ, అమకతాడు, కృష్ణగిరి, టి.గోకులపాడు, ఆలంకొండ గ్రామ పంచాయతీల పరిధిలో చాలాచోట్ల ప్రభుత్వ భూములను అంతర్జాలంలో నమోదు చేశారన్న అభియోగాలు రామచంద్రరావుపై ఉన్నాయి. గ్రామాల్లో ఒకరు సాగులో ఉంటే మరొకరి పేరు నమోదు చేయడంతో కొన్నిచోట్ల ఘర్షణలకు కారణమైంది.

ఉన్నతాధికారుల దృష్టికి..

కటారు కొండ రెవెన్యూ పరిధిలో మూడు ఎకరాల పొలాన్ని 13 ఎకరాలుగా చూపించి పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు.. వాటిని బ్యాంకులో తనఖా పెట్టి రూ.2 కోట్ల రుణానికి దరఖాస్తు చేసుకొన్నట్లు సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యింది. దీంతో ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ రామచంద్రరావుపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. జేసీ విచారణ చేపట్టగా, వాస్తవాలుగా తేలడంతో వేటు వేశారు. ఈ వ్యవహారం బయటకు రాకముందే రామచంద్రరావు రెండు నెలలు క్రితం సెలవులో వెళ్లారు. జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:PROTESTS ON NEW DISTRICTS: కొత్త జిల్లాల ఏర్పాటుపై కొనసాగుతున్న నిరసనలు

ABOUT THE AUTHOR

...view details