Girl died with snake bite : కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరులో విషాదం చోటు చేసుకుంది. మనుమరాలు పాము కాటుతో మృతి చెందడం తట్టుకోలేని నానమ్మ గుండెపోటుతో చనిపోయింది. ఈ వరుస ఘటనలతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈనెల 17న పొలం పనులు చేస్తుండగా మనుమరాలు రాణెమ్మ పాము కాటుకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మనుమరాలి మృతిని తట్టుకోలేక నానమ్మ వెంకట లక్ష్మమ్మ.. గుండె పోటుతో మరణించారు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Girl died with snake bite : పాము కాటుతో మనుమరాలి మరణం...ఆగిన నానమ్మ గుండె... - Girl died with snake bite in Kurnool
Girl died with snake bite : కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో నానమ్మ, మనుమరాలు మృతి చెందారు. పాము కాటుతో మనుమరాలు మృతి చెందగా.. ఆ వార్త విన్న నానమ్మ గుండె ఆగిపోయింది.
పాము కాటుతో మనుమరాలి మరణం...ఆగిన నానమ్మ గుండె...