గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. సెప్టెంబర్1నుంచి నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. మొదటి రోజు 15.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షరాయనున్నారని చెప్పారు. కర్నూలు జిల్లాలో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కమిషనర్ సమీక్షించారు. అభ్యర్థులకు ఏదైనా సమస్యలు ఉంటే కాల్ సెంటర్ కు ఫోన్ చేయాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సూచించారు.
సచివాలయ ఉద్యోగాల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి:గిరిజా శంకర్ - panchayathi raj
సెప్టెంబర్ 1నుంచి 8వరకూ జరిగే గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఏర్పాట్లు పూర్తయినట్లు పంచాయతీ రాజ్ కమిషనర్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాకు పరీక్ష ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.
సచివాలయ ఉద్యోగాల పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పూర్తి:గిరిజా శంకర్