హడావుడిగా పుష్కరాల ముందు రోజు పూర్తి చేసిన మేళిగనూర్ ఘాట్ నిర్మాణం అంచనా విలువ రూ.1.27 కోట్లుగా అధికారులు ప్రతిపాదించారు. రివర్స్‌టెండర్స్‌లో కడప జిల్లాకు చెందిన ఓ గుత్తేదారుడు 4.90% ఎక్కువగా కోట్ చేసి రూ.1.34కోట్లకు పనులు దక్కించుకున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక, గుత్తేదారు నిర్లక్ష్యంతో నాణ్యతకు తిలోదకాలివ్వడంతో ఘాట్ మధ్యలో చీలిక ఏర్పడింది.
కర్నూలు నగరంలోని నాగసాయి ఘాట్ సైతం రివర్స్ టెండర్లలో ఓ గుత్తేదారుడు 7.961 లెస్‌కు కోట్ చేశారు. రూ.1.10కోట్లతో ఘాట్ నిర్మాణ పనులు దక్కించుకున్నారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో ఒక్కో ఘాట్‌కు ఇలా రూ.కోటిపైగా ప్రతిపాదనలు చేశారు. తీరా గుత్తేదారు పనులు మొదలు పెట్టి మట్టి తీయగానే... పాత ఘాట్ మెట్లు దర్శనమిచ్చాయి. ఇంకేముంది కలిసొచ్చిన కాలం అనుకుంటూ పాత మెట్లకు కొత్త టైల్స్ వేశారు.