Ganesh immersion: కర్నూలులో వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నులపండుగగా కొనసాగుతోంది. ఉదయం నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద మొదటి వినాయక విగ్రహానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హాఫీజ్ ఖాన్, విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు జి. రాఘవరెడ్డి పూజలు చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లడ్డూ వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం వినాయక ఘాట్ వద్ద ముఖ్య అతిథులు పూజ చేసి నిమజ్జన కార్యక్రమం ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Ganesh immersion: కర్నూలులో గణేశ్ నిమజ్జనం.. తరలివస్తున్న గణనాథులు - కర్నూలు వినాయక వార్తలు
Ganesh immersion: కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురు నేతలు శోభాయాత్రను ప్రారంభించారు.
కర్నూలు గణేష్ నిమజ్జన శోభయాత్ర