కర్నూలులో నేడు గణేశ్ నిమజ్జనోత్సవం జరగనుంది. గణేశ్ నిమజ్జనానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో 700కుపైగా వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. కేసీ కెనాల్ వద్దనున్న వినాయక ఘాట్ వద్ద విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జరగనుంది. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మూడు క్రేన్లు అందుబాటులో ఉంచారు. రాంబొట్ల దేవాలయం వద్ద ఉదయం 11 గంటలకు తొలి విగ్రహానికి పూజలు చేసిన తర్వాత శోభాయాత్ర ప్రారంభంకానుంది. ప్రజాప్రతినిధుల పూజల తర్వాత నిమజ్జన కార్యక్రమం ప్రారంభించనున్నారు. తొలి విగ్రహానికి పూజ తర్వాతే మిగిలిన విగ్రహాలు బయలుదేరనున్నాయి.
తొలుత కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన పరిపాలన గణపతి విగ్రహం నిమజ్జనం చేయనున్నారు. అతిథుల చేతుల మీదుగా పరిపాలన గణపతి విగ్రహం నిమజ్జనం జరగనుంది. పరిపాల గణపతి విగ్రహం తర్వాతే మిగిలిన విగ్రహాల నిమజ్జనం చేస్తారు. రాత్రి 10 గంటల్లోగా నిమజ్జనం పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు.