కర్నూలులో జరిగిన ఓ దొంగతనం కేసులో తెలంగాణకు చెందిన నలుగురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని కృష్ణా నగర్ వద్ద ఉన్న శక్తి మార్కెటింగ్ సంస్థలో ఆ ముఠా... ఏప్రిల్ 2 న రూ. 28 లక్షలు చోరీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి పట్టుబడివారిలో.. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యూసఫ్ పై ఇప్పటికే 10 కేసులు ఉన్నట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. యూసఫ్తో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 28 లక్షల నగదుతో పాటు ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.