అనంతపురం-అమరావతి రహదారి కోసం తీసుకుంటున్న భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నపాడు, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లో 2వేల 690 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా సేకరించారని ఆరోపించారు. మార్కెట్ విలువ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారమివ్వాలి' - Farmers Protest
రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుటు అన్నదాతలు ధర్నా చేశారు.
అన్నదాతల ధర్నా